MI vs KKR: నేడు ముంబై Vs కోల్ కతా మ్యాచ్..! 4 d ago

ఐపీఎల్ లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ రోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, రెండు వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇవాళ గెలవాలనే పట్టుదలతో ఉంది. ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై గెలిచి పరువు నిలబెట్టుకోవాలని యోచిస్తోంది. అటు కేకేఆర్ ఇప్పటివరకు రెండు మ్యాచులాడి ఒకదాంట్లో గెలిచి, మరొకటి ఓడింది. కాగా, మళ్లీ విజయంతో గాడిలో పడాలని ఆ జట్టు భావిస్తోంది.